ఓటుకు నోటు ఇవ్వకపోతే మహాత్మాగాంధీ సైతం ఎలక్షన్స్ లో ఓడిపోతారు

updated: February 27, 2018 20:04 IST
ఓటుకు నోటు ఇవ్వకపోతే మహాత్మాగాంధీ సైతం ఎలక్షన్స్ లో ఓడిపోతారు

మహాత్మ గాంధీ ..రాజకీయాల్లోకి వచ్చి ఏ పదివికి  పోటీ చెయ్యలేదు. అసలు ఎలక్షన్స్ లో నిలబడటానికి కూడా ఒప్పుకోలేదు. రాజకీయాలతో సంభంధం లేకుండానే ప్రజలకు సేవ చేయవచ్చుని ఆయన నిరూపించేందుకు అన్నట్లుగా తన జీవితాన్ని స్వచ్ఛంగా ఏ మచ్చా లేకుండా గడిపారు. అలాంటి మహాత్మాగాంధీ  ఈరోజున ఎలక్షన్స్ లో నిలబడితే పరిస్దితి ఏమిటి...మనకైతే ఈ ఆలోచన రాలేదు కానీ..ఒడిశా  రాష్ట్ర రెవిన్యూ మంత్రి మహేశ్వర్ మహంతి కు వచ్చనట్లుంది. ఆయన తన ప్రతిపక్షణాల అవినీతిని ఎండగట్టడానికి గాంధీ మహాత్ముని ప్రస్దావన తెచ్చారు. 

రీసెంట్ గా ఆయన పూరిలోని ఓ  లా కాలేజీ  ఏర్పాటు చేసిన పబ్లిక్ ఆఫీస్ ల్లో అవినీతి, చట్టబద్దంగా ప్రక్షాళన  అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్బంగా ..అంతా అవినీతిమయమైపోయిన ఈ రోజుల్లో డబ్బు పంచకపోతే ...మహాత్ముడే వచ్చి ఎలక్షన్స్ లో నిలబడినా గెలవటం చాలా కష్టం..అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు

comments